పాయకరావుపేట: మండలంలో ఎస్.నర్సాపురం గ్రామ శివారులో చెరువు వద్ద మట్టి తవ్వుతున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ జై.పురుషోత్తం తెలిపారు. శుక్రవారం తెల్లవారుజూమున గ్రామ శివారులో చెరువు వద్దకు వెళ్లి తనిఖీ చేయగా, జేసీబీ (ఏపీ39 హెచ్‌ఆర్ 4923)తో మట్టి తవ్వుతున్నట్లు గుర్తించి అడ్డుకున్నామన్నారు. సదరు జేసీబీ డ్రైవరును చెరువు మట్టి తవ్వడానికి సంబంధించి ఏమైనా అనుమతులు, ఇతర అధికారక పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా, ఏమీ లేవని సమాధానమిచ్చారని తెలిపారు. దీంతో జేసీబీని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్‌కి అప్పగిస్తామని తెలిపారు.


