సీలేరులో ‘ఇరుముడి’ సందడి | - | Sakshi
Sakshi News home page

సీలేరులో ‘ఇరుముడి’ సందడి

Aug 22 2026 1:17 AM | Updated on Aug 22 2026 1:17 AM

సీలేరు: మాస్‌ మహారాజ రవితేజ హీరోగా సీలేరు పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు చిత్రీకరించిన ‘ఇరుముడి’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ ప్రాంత అందాలను సినిమాలో చూడాలని స్థానికులు ఎంతో కాలంగా ఎదురుచూశారు. సినిమా విడుదల కావడంతో సీలేరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు‘ అనే పాటను సీలేరు మారెమ్మ తల్లి ఆలయంలో చిత్రీకరించారు. ఇది ప్రేక్షకాదరణ పొందడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుంటవాడ రిజర్వాయర్‌, ఇంటెక్స్‌ డ్యామ్‌ వంటి ప్రాంతాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. తమ ప్రాంత అందాలు, పర్యాటక ప్రదేశాలు వెండితెరపై కనిపించడం పట్ల స్థానికులు గర్వపడుతున్నారు. షూటింగ్‌ సమయంలో సీలేరు ప్రాంత అందాలకు, ఇక్కడి ప్రజల సహకారానికి దర్శకుడు, హీరో రవితేజ ముగ్ధులయ్యారని, సినిమా హిట్‌ అయితే ఈ ప్రాంతంలో మరిన్ని షూటింగ్‌లు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement