చింతపల్లి: స్థానిక ఆచార్య ఎన్జీరంగా సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 26న జోనల్ స్థాయిలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గుంటూరు ’లాం’ వద్ద నిర్వహించిన కౌన్సెలింగ్‌లో చింతపల్లి సేంద్రీయ పాలిటెక్నిక్‌లోని మొత్తం 25 సీట్లకు గానూ 12 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 13 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకే చింతపల్లిలోనే నేరుగా స్పాట్ కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ అయిన అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని సూచించారు. ఇతర వివరాలు, సందేహాల కోసం 9014637080 నంబరులో సంప్రదించాలని కోరారు.


