ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యం.. ప్రయాణికులకు చుక్కలు | - | Sakshi
Sakshi News home page

ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యం.. ప్రయాణికులకు చుక్కలు

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

అల్లిపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల సమయపాలనపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేమనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం గురుద్వారా జంక్షన్‌లో సైమన్‌ అబీబ్‌ అనే ప్రయాణికుడు ఉదయం 8 గంటల నుంచే ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ కోసం వేచి ఉన్నారు. ఉదయం 8.30 గంటలకు రావాల్సిన బస్సు 8.45 గంటలైనా రాకపోవడంతో అక్కడి ఎంకై ్వరీ సిబ్బందిని ప్రశ్నించగా..‘బస్సు రావాల్సి ఉంది.. ఇంకా రాలేదు’ అనే సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఫోన్‌ ద్వారా ఎంకై ్వరీని సంప్రదించినా స్పష్టమైన సమాచారం అందలేదని, దీంతో సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేక విమానం మిస్సయ్యే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రాఫిక్‌ కారణంగా స్వల్ప ఆలస్యం: ఆర్‌ఎం

ఈ అంశంపై ఆర్‌టీసీ రీజినల్‌ మేనేజర్‌ బి. అప్పలనాయుడు స్పందిస్తూ, ట్రాఫిక్‌ రద్దీ తదితర కారణాలతో ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు అప్పుడప్పుడు 5 నుంచి 10 నిమిషాలు ఆలస్యమవు తున్నాయని తెలిపారు. అయినప్పటికీ మొత్తం మీద బస్సులు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి బస్టాప్‌ వద్ద బస్సుల రాకపోకల సమయాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేశామని, సమయపాలనపై సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement