మాడుగుల ఎమ్మెల్యే హామీలపై సీఎంకు విన్నవిస్తాం | - | Sakshi
Sakshi News home page

మాడుగుల ఎమ్మెల్యే హామీలపై సీఎంకు విన్నవిస్తాం

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హామీలు ఇచ్చి అమలు చేయడం మరిచిపోయారని, ఈ విషయంపై ఈ నెల 22న కె.కోటపాడులో పర్యటించనున్న సీఎం చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీనబాడు – దేవరాపల్లి రోడ్డు నుంచి వయా వాలాబు మీదుగా కోనాంకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా నేటికి అతీగతీ లేదన్నారు. చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రపేటకు కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి పల్లె పండుగ పేరిట అట్టహాసం చేసి అసంపూర్తిగా నిలిపివేశారన్నారు. బోడిగరువు, నేరెళ్లపూడి, ఎం.అలమండ– మామిడిపల్లి రోడ్లు రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. రైవాడ జలాశయం రూపురేఖలు మారుస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే హామీని గాలికి వదిలేశారన్నారు. దేవరాపల్లిలో హోల్‌సేల్‌ కాయగూరల మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజీ, దేవరాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెరవేర్చని ఇతరత్రా హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తామన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement