కె.కోటపాడు: మండలంలోని ఎ.కోడూరులో ఈ నెల 22న సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల సమీపంలో సీఎం హెలిప్యాడ్ నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రజావేదిక ప్రాంతానికి చేరుకునే మార్గాన్ని శుభ్రం చేయిస్తున్నారు. ఇక్కడ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారుల వాహనాల పార్కింగ్ కోసం గ్రామ సమీపంలో ఖాళీ ప్రదేశాలను ప్రజా వేదిక కోసం హైస్కూల్ ప్రాంగణాన్ని జేసీబీలతో సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్‌పటేల్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం పరిశీలించారు.


