తాటిచెట్లపాలెం: సోలాపూర్–అనకాపల్లి–సోలాపూర్ మధ్య నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21 నుంచి రెగ్యులర్ రైలుగా నడవనుంది. సోలాపూర్–అనకాపల్లి (11313) రైలు శుక్రవారం ఉదయం 9.20 గంటలకు సోలాపూర్‌లో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు అనకాపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి–సోలాపూర్ (11314) రైలు ఈ నెల 22 నుంచి రెగ్యులర్‌గా నడుస్తుంది. శనివారం సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లిలో బయల్దేరి ఆదివారం రాత్రి 11.50 గంటలకు సోలాపూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్, అనంతపురం, ధర్మవరం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి తదితర స్టేషన్లలో ఆగుతాయి.
చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు
చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ (07037) వీక్లీ స్పెషల్ ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07038) రైలు ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.


