ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు కూటమి తూట్లు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు కూటమి తూట్లు

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

● 24న కలెక్టరేట్‌ వద్ద ధర్నా ● డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్‌

నర్సీపట్నం: షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు తీసుకువచ్చిన సబ్‌ ప్లాన్‌కు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడించిందని డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్‌ విమర్శించారు. మున్సిపాలిటీలో గురువారం ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఎస్సీ, ఎస్టీ పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలన్నారు. ఇతర పథకాలకు నిధులను మళ్లించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 24న కలెక్టరేట్‌ వద్ద ధర్నా తలపెట్టామన్నారు. కొన్ని సందర్భాల్లో నిధులు ఖర్చు కాక మురిగిపోతున్నాయన్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు వంద శాతం ఖర్చు చేయడంలేదన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ పథకానికి బడ్జెట్‌లో రూ.18,497.68 కోట్లు కేటాయించిస్తే, రూ.13,571.50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2025–26లో సబ్‌ ప్లాన్‌కు రూ.20,281.20 కోట్లు కేటాయించి రూ.15,616.45 కోట్లు ఖర్చు చేశారన్నారు. దీని వల్ల ఎస్సీ వర్గాలు నష్టపోతున్నాయని వాపోయారు. ఎస్సీ వర్గాలకు తీవ్ర ద్రోహం జరుగుతుందన్నారు. సమావేశంలో డీహెచ్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement