కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానంలో ఉందని, నీతి ఆయోగ్‌ ర్యాంకింగుల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కిందని | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానంలో ఉందని, నీతి ఆయోగ్‌ ర్యాంకింగుల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కిందని

Aug 20 2026 12:23 AM | Updated on Aug 20 2026 12:23 AM

సాహస ప్రయాణం

సీలేరు: గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని బత్తునూరు గ్రామం వద్ద వాగు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగును దాటి గూడెంకొత్తవీధి మండల సరిహద్దు అటవీ ప్రాంతం మీదుగా కొయ్యూరు మండలానికి వెళ్లే పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలంలో అత్యవసర సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణించడానికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నడివిడి వద్ద అసంపూర్తిగా..

మండలంలోని దారకొండ పంచాయతీ నడివిడి గ్రామం మధ్యలో పెద్ద వాగు ఉంది. వర్షాకాలంలో గర్భిణులు, అనారోగ్యంతో ఉన్న రోగులు ఈ వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావలసి వస్తోంది. ఈ వంతెన నిర్మాణం ఏడాదిగా టెండర్‌ దశలోనే నిలిచిపోయిందని ఆ ప్రాంత గిరిజనులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

పిల్లి గెడ్డ వంతెన సమస్య

తెలంగాణ రాష్ట్రం నుంచి సీలేరు మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న పిల్లి గెడ్డ వంతెన నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ వంతెనపై రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మించినప్పటికీ, అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు అవసరమని సంబంధిత అధికారులు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నివేదికలు పంపినా స్పందన కరవైంది.

కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన

దారకొండ నుంచి ఒడిశా వెళ్లే మార్గంలో ఉన్న చిన్న గంగవరం వంతెన ఏడాదిన్నర కిందట వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ వంతెనను నిర్మించాలని ఆ ప్రాంత గిరిజనులు అనేకసార్లు ధర్నాలు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాకాలంలో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేసి, గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.

మాదిగ మల్లువంతెన దుస్థితి

మాదిగ మల్లువంతెన దుస్థితి

పొంగుతున్న వాగులు.. వంతెనలు లేక అవస్థలు

ఏడాదిగా నిలిచిన నడివిడి బ్రిడ్జి నిర్మాణం బురదమయంగా అప్రోచ్‌ రోడ్లు

కలెక్టర్‌ ప్రకటనకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు

నీతి ఆయోగ్‌ ర్యాక్సింగ్‌లో ప్రథమస్థానం అని చెబుతున్నా కరువైన మౌలిక వసతులు

దారకొండ పంచాయతీ నుంచి అడవి మార్గం ద్వారా పోలవరం జిల్లాకు వెళ్లే దారిలో ఉన్న మాదిగ మల్లు వంతెన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వర్షాల కారణంగా వంతెనకు రెండువైపులా రోడ్డు వేసినా, దానిపై తారు రోడ్డు వేయకపోవడంతో పూర్తిగా గోతులు పడి బురదగా మారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement