మాదకద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం

Aug 18 2026 12:27 AM | Updated on Aug 18 2026 12:27 AM

చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు

కొయ్యూరు: మాదకద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారమవుతుందని చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. కాకరపాడు గురుకుల జూనియర్‌ బాలుర కళాశాలలో కేరీర్‌ గైడెన్స్‌పై సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఆయన సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ యువత గంజాయికి దూరంగా ఉండాలన్నారు. ఇటీవల సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ ద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంప ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాస్‌, ప్రిన్సి పాల్‌ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు

పోలీసుస్టేషన్ల తనిఖీ

కొయ్యూరు, మంప స్టేషన్లను డీఎస్పీ తిరుపతిరావు తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి, సి బ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement