వరాహ నారసింహునికి ఆర్జిత సేవల వైభోగం | - | Sakshi
Sakshi News home page

వరాహ నారసింహునికి ఆర్జిత సేవల వైభోగం

Aug 17 2026 8:23 AM | Updated on Aug 17 2026 8:23 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు సహస్రనామార్చన ఘనంగా జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలతో సహస్రనామార్చన జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు.

శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు.

ఘనంగా గరుడసేవ

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ బేడామండపంలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళిపూజ నిర్వహించారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. విశేష హారతులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement