గూడెంకొత్తవీధి: స్థానిక ఏకలవ్య జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ నాయుడు అండర్–16 జూనియర్ అథ్లెటిక్స్ విభాగంలోని షాట్‌పుట్‌లో రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరచిన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి. రమణారావు, అధ్యాపక సిబ్బంది అభినందించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించిన పోటీల్లో చంద్రశేఖర్ నాయుడు రజత పతకం కై వసం చేసుకున్నాడు. ఈ ప్రతిభ ఆధారంగా వచ్చే నెలలో జరిగే 37వ దక్షిణ భారత దేశ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఆయన ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.


