మతిస్థిమితం లేని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగింత

Aug 17 2026 8:17 AM | Updated on Aug 17 2026 8:17 AM

మతిస్థిమితం లేని మహిళను

అప్పగిస్తున్న రూరల్‌ ఎస్‌ఐ రాజారావు

నర్సీపట్నం: మతిస్థిమితం లేక గబ్బాడ శివారులో తిరుగుతున్న 27 ఏళ్ల మహిళకు రూరల్‌ ఎస్‌ఐ రాజారావు చికిత్స అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు. ఓ మహిళ అనారోగ్యంతో, మతిస్థిమితం లేక సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్‌ఐ రాజారావు, సిబ్బందితో వెళ్లి ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి, పేరు, చిరునామా వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. తన పేరు భార్గవి అని, స్వస్థలం కదిరి సత్యసాయి జిల్లా అని మాత్రమే ఆమె చెప్పింది. ఆమెను ఏరియా ఆస్పుత్రిలో చేర్పించారు. అతి కష్టం మీద కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులు చింతలపల్లి లక్ష్మి, నారాయణస్వామికి ఆమెను అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement