తరలివస్తున్న సందర్శకులు
డుడుమ జలాశయం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
మరో లోకాన్ని తలపిస్తున్న జలపాతాల అందాలు
భారీగా చేరుతున్న వరదనీరు
ముంచంగిపుట్టు/పెదబయలు/డుంబ్రిగుడ: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నారు. ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న ఈ జలపాతాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రధాన పర్యాటక కేంద్రాలన్నీ సందర్శకులతో కళకళలాడాయి.
ఆకట్టుకుంటున్న పిట్టలబొర్ర(తారాబు) జలపాతం
పులకిస్తున్న ప్రకృతి
వసతుల లేమితో అవస్థలు
వ్యాపారాల్లో వెలుగు
జలపాతాల వద్ద పర్యాటకుల తాకిడి పెరగడంతో చాపరాయి వంటి ప్రాంతాల్లో వెదురు చికెన్, వెదురు బిర్యాని విక్రయించే స్థానిక వ్యాపారులకు మంచి ఆదాయం వస్తోంది. ఈ సీజన్‌లో పర్యాటక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఆదాయం నమోదైనట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. పర్యాటకశాఖ స్పందించి, తక్షణమే ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సందర్శకులు కోరుతున్నారు.


