ప్రిన్సిపాల్ రామ్మోహనరావు
చింతపల్లి: స్థానిక నివాస అనుబంధ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఆర్‌ఐటీఐ)లో ప్రవేశాల కోసం ఈ నెల 13 (సోమవారం) నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విధిగా హాజరు కావాలని స్థానిక ప్రిన్సిపాల్ రామ్మోహనరావు తెలిపారు.ఈ కౌన్సెలింగ్ కార్యక్రమం అరకులోయలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించబడుతుందన్నారు. సోమ వారం నుంచి బుధవారం వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. సోమవారం ఒకటి నుంచి 435, మంగళవారం 436 నుంచి 995, బుధవారం 996 నుంచి 1630 ర్యాంకు గల అభ్యర్థులు హాజరు కావాలని ఆయన సూచించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు, విద్యాసంస్థల్లో పొందిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని ప్రిన్సిపాల్ సూచించారు.


