పాడేరు రూరల్: పాడేరు జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగాఎస్.బి. పోతురాజు, జిల్లా అధ్యక్షురాలిగా గెమ్మెలి రామి, ప్రధాన కార్యదర్శిగా సారే సోందేవి, కోశాధికారిగా కె. లక్ష్మి, వీరితో పాటు మరో 12 మందిని జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
బాధ్యతతో పనిచేస్తాం: రామి, సోందేవి
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు గెమ్మెలి రామి, సారే సోందేవి మాట్లాడుతూ, జిల్లా కార్యవర్గంలో చోటు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ఎన్నికతో తమపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. తమను నమ్మి బాధ్యతలు అప్పగించిన కార్మికులందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కె.లక్ష్మి
గెమ్మెలి.రామి
సోందేవి


