ప్రకృతి సోయగాల కనువిందు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సోయగాల కనువిందు

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

సరిహద్దుల్లోని ప్రసిద్ధ డుడుమ జలపాతం సుమారు 558 అడుగుల ఎత్తు నుంచి మంచు తెరల మధ్యలో జాలువారుతూ పర్యాటకులను కట్టిపడేస్తోంది.

● ముంచంగిపుట్టు మండలంలోని జడిగూడ, తారాబు (పిట్టలబొర్ర), హంసబంద, బురదగుంట, నెమలి, రంగినిగూడ జలపాతాలు పాల నురగలా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి.

● పెదబయలు మండలం గిన్నెలకోట–జామిగుడ పంచాయతీల మధ్య ఉన్న పిట్టలబొర్ర జలపాతం 150 అడుగుల ఎత్తు నుంచి పడుతూ పాలపుంతను తలపిస్తోంది. మరోవైపు డుంబ్రిగుడలోని చాపరాయి జలపాతం, అంజోడ సిల్క్‌ ఫారం, అరకు ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది.

● జలపాతాల అందాలను చూసి ఆనందిస్తున్న పర్యాటకులు, అక్కడి మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● తారాబు, జడిగూడ వంటి జలపాతాలకు వెళ్లే మార్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పిట్టలబొర్ర జలపాతానికి చేరుకోవాలంటే జామిగుడ నుంచి మూడు కిలోమీటర్ల మేర కొండకోనల్లో కాలినడకన సాహసోపేత ప్రయాణం చేయాల్సి వస్తోంది. స్థానికులు వేసిన రాళ్ల దారులు ప్రమాదకరంగా మారాయి.

● పర్యాటక ప్రాంతాల వద్ద కనీసం తాగునీరు, ఆహారం దొరకడం లేదు. రాత్రి బస చేసేందుకు కాటేజీలు లేకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు.

● ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో రవాణా, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల స్థానిక గిరిజన యువతకు ఉపాధి లభించడమే కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పర్యాటకులు వాపోతున్నారు.

పాల నురగ మాదిరిగా కనువిందు చేస్తున్న తారబు జలపాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement