డాబాగార్డెన్స్: ఆంధ్రప్రదేశ్ హస్తకళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని టర్నర్ చౌల్ట్రీలో ఏర్పాటు చేసిన హస్తకళా మహోత్సవానికి విశేష స్పందన వస్తోందని నిర్వాహకులు కార్తీక్‌కుమార్ ఆదివారం తెలిపారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన హస్తకళలు వీక్షించడానికి, కొనుగోలుకు నగరం నుంచే గాక జిల్లా నలుమూలల నుంచి అనేక మంది తరలివస్తున్నారని పేర్కొన్నారు. గృహిణులు, యువత అభిరుచులకు తగ్గుట్టుగా ఆధునిక మోడల్స్‌లో ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలాట కళఖండాలు, కలంకారీ చీరలు, కలంకారీ చిత్రాలు, ఇమిటేషన్ ఆభరణాలు వంటి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళ ఉత్పత్తులను కళాకారుల నుంచి నేరుగా విక్రయానికి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సోమవారంతో ఈ మహోత్సవం ముగియనుందన్నారు.


