ఠారెత్తించిన సన్‌డే..! | - | Sakshi
Sakshi News home page

ఠారెత్తించిన సన్‌డే..!

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

దశాబ్దం తర్వాత జూలైలో

రికార్డు ఉష్ణోగ్రత నమోదు

2015 జూలై 7న 39 డిగ్రీల

గరిష్ట ఉష్ణోగ్రత

ఆదివారం 38.5 డిగ్రీలు నమోదు

నడి వేసవిని తలపిస్తున్న జూలై నెల

సాక్షి, విశాఖపట్నం: క్యాలెండర్‌ వైపు చూస్తే జూలై నెల కనిపిస్తోంది.. గుమ్మం దాటితే మాత్రం మే నెలలా మాడు పగులగొడుతోంది. అప్పుడెప్పుడో వెళ్లిపోయిన రోహిణి కార్తె ఇంకా సాగర నగరిలో తిష్టవేసిందా? అన్నట్లు భానుడు భగభగమంటున్నాడు. ‘ఏంటండీ బాబూ... జూలైలో కూడా ఈ ఎండలేంటి?’అని నగర వాసులు ఆశ్చర్యపోయేలా వాతావరణం యూ–టర్న్‌ తీసుకుంది. ఆదివారం అక్షరాలా ‘సన్‌’డే గా మారి విశాఖలో సెగలు పుట్టించింది.

వరుణిడిని వణికిస్తున్న ఎల్‌నినో!

సాధారణంగా జూలై మొదటి వారం అంటే.. నైరుతి రుతుపవనాల జోరుతో ఆకాశంలో మేఘాలు పరుచుకుని, చల్లని ఈదురు గాలులు వీయాలి. కానీ, ఎల్‌నినో పరిస్థితి.. వాతావరణ వ్యవస్థనే హైజాక్‌ చేసేసింది. వరుణుడి ఎంట్రీని అడ్డుకుని, భానుడికి వీవీఐపీ పాస్‌ ఇచ్చేసింది. ఫలితంగా గాలిలో తేమ అదృశ్యమై, ఆకాశం నిర్మలంగా మారి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీనికి నిదర్శనమే ఆదివారం నమోదైన 38.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. సముద్రపు గాలులు సైతం వడగాల్పులను తలపించడంతో వీకెండ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకున్న నగర వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

దశాబ్దం తర్వాత

జూలైలో ఇంతటి ఉక్కపోత, ఎండల తీవ్రత వైజాగ్‌ వాసులకు ఎదురవడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. వాతావరణ శాఖ పాత రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే... సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2015 జూలై 7న నగరంలో ఇలాగే 39 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. 1997 జూలైలోనూ 39.9 డిగ్రీల రికార్డే విశాఖ చరిత్రలో ఇదే అత్యధికం. మళ్లీ ఇన్నాళ్లకు అదే తీరుగా నాటి ఫ్లాష్‌బ్యాక్‌ రిపీట్‌ అవడం చూస్తే.. ఎల్‌నినో ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఈ ‘జూలై’ఎండలే ప్రత్యక్ష సాక్ష్యం.

విశాఖలో జూలైలో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలివే..

సంవత్సరం నమోదైన ఉష్ణోగ్రత

(సెంటీగ్రేడ్‌లలో)

1997 జూలై 16 39.9

2015 జూలై 7 39.0

2026 జూలై 12 38.5

2018 జూలై 19 36.8

2014 జూలై 5 36.1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement