గొంది చినబ్బాయ్‌ను సత్కరిస్తున్న
జేఏసీ నాయకులు
అనకాపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) వైస్ చైర్మన్‌గా గొంది చినబ్బాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక నర్సింగరావుపేటలో ఏపీటీఎఫ్ భవనంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో చినబ్బాయ్‌లను కమిటీ సభ్యులు పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు రొంగలి అక్కునాయుడు, జిల్లా కార్యదర్శి గుత్తుల సూర్య ప్రకాష్, సీనియర్ నాయకులు రవికుమార్, నూతన్ కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


