● పార్టీ కమిటీల డిజిటలైజేషన్‌లో నర్సీపట్నం టాప్
నర్సీపట్నం: వైఎస్సార్‌సీపీ కమిటీల నియామకంలో రాష్ట్రంలోనే నర్సీపట్నం నియోజకవర్గం ముందంజలో ఉండటంతో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మెచ్చుకున్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ వివిధ విభాగాల కమిటీలను నియమించడంతోపాటు డిజిటలైజేషన్ చేసిన ప్రక్రియను పార్టీ అధినేతకు గణేష్ వివరించారు. కమిటీల నియామకంలో ముందంజలో ఉండటంతో.. ఇదే స్ఫూర్తితో పని చేయాలని అధినేత సూచించినట్లు గణేష్ తెలిపారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏకా శివ, నాలుగు మండలాల అధ్యక్షులు శానాపతి వెంకటరత్నం, గొలుగొండ పాణిశాంతరావు, లగుడు నాగేశ్వరరావు పార్టీ అధినేతను కలిసిన వారులో ఉన్నారు.


