ఉన్నత విద్యకు భాష అడ్డంకి కాదు... | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు భాష అడ్డంకి కాదు...

Mar 3 2026 8:05 AM | Updated on Mar 3 2026 8:05 AM

సదస్సులో మాట్లాడుతున్న సత్యనారాయణ

మాకవరపాలెం : తెలుగు మీడియంలోనూ ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఉత్తరప్రదేశ్‌ మాజీ డీఐజీ, కోటవురట్ల మండలం పాములవాకకు చెందిన కిల్లాడ సత్యనారాయణ అన్నారు. మాకవరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల్లో సోమవారం విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాలన్నారు. మాతృభాషను గౌరవిస్తూ ఇతర భాషలను నేర్చుకోవాలన్నారు. తెలుగులో చదివినా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావొచ్చన్నారు. పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారు అభ్యసించే ఏ చదువులకై నా తానే నిధులు సమకూరుస్తానన్నారు. ఇప్పటి నుంచే భవిష్యత్‌లో ఏం చేయాలో నిర్ణయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్యోతీరావుపూలే ఆల్‌ ఇండియా ఓబీసీ చైర్మన్‌ పోతల ప్రసాద్‌, మండల ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ మాకవరపాలెం మండలం నుంచే స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్న సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement