జీసీసీ రూటు సపరేటు | - | Sakshi
Sakshi News home page

జీసీసీ రూటు సపరేటు

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

పాచ్‌మెంట్‌ కాఫీ గింజలు

జీసీసీ కాఫీ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో దళారులదే ఇష్టారాజ్యంగా మారింది. మార్కెట్‌లో పోటీ లేకపోవడంతో దళారులు కాఫీ కొనుగోలు ధరలను భారీగా తగ్గించేశారు.కిలో పాచ్‌మెంట్‌ను రూ.390, చెర్రీ రకాన్ని కిలో 200ధరతో కొనుగోలు చేస్తుండడంతో గిరిజన రైతులు నష్టపోతున్నారు. గిరిజన రైతుల వద్ద కాఫీ గింజల నిల్వలు అధికంగా ఉండడంతో వారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సాక్షి,పాడేరు: జిల్లాలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగుచేసే కాఫీ పంట నాణ్యతలో ప్రపంచంలోనే నంబర్‌–1లో నిలుస్తుంది. ఇంత ప్రాధాన్యత గల మన్యం కాఫీ గింజలను వ్యాపారులు ఏటా పోటాపోటీగా కొనుగోలు చేస్తారు. జిల్లాలో 11 మండలాల పరిధిలో 1.60 లక్షల ఎకరాల్లోని కాఫీ తోటల ద్వారా ప్రతీ సంవత్సరం 17వేల టన్నుల వరకు కాఫీ గింజలను గిరిజన రైతులు ఉత్పత్తి చేసి, విక్రయిస్తున్నారు. ఈఏడాది జీసీసీ మధ్యలోనే కాఫీ గింజల కొనుగోలును నిలిపివేయడం, మరోవైపు దళారీలు ధరలు పతనం చేయడంతో కాఫీ రైతులు భారీగా నష్టపోతున్నారు.జీసీసీ చైర్మన్‌ కిడారి సర్వేశ్వరరావుకు కూడా స్థానిక గిరిజనుడే అయినప్పటికీ కాఫీ కొనుగోళ్ల విషయంలో రైతులకు న్యాయం జరగడం లేదు.

ధరలు తగ్గాయన్న నెపంతో...

సీజన్‌ చివరి వరకు గిట్టుబాటు ధరతో కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేస్తుందని ఆశపడిన కాఫీ రైతులకు నిరాశే మిగిలింది. పాచ్‌మెంట్‌ కాఫీ గింజలను కిలో రూ.450, చెర్రీ రకం కిలో రూ.270 ధరతో జీసీసీ కొనుగోలు ప్రారంభించింది.అయితే బెంగళూరు కాఫీ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గాయనే నెపంతో 20రోజుల నుంచి కాఫీ కొనుగోలును జీసీసీ నిలిపివేసింది. టార్గెట్‌ పూర్తవకుండానే కాఫీ గింజల కొనుగోలును నిలిపివేయడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.సీజన్‌ మధ్యలో కొనుగోలు నిలిపివేసి తమను జీసీసీ మోసం చేసిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దళారుల తో నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement