పెదబయలు: జిల్లాలో గిరిజన రైతులు అధికంగా పండించే పసుపు, పిప్పళ్ల ధరలు వారపు సంత మార్కెట్‌లో పతనమవుతున్నాయి. సోమవారం పెదబయలు వారపు సంతలో పిప్పళ్లను కిలో రూ.290 నుంచి రూ.300 ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు.ఇదే సీజన్ ప్రారంభంలో రూ.330 నుంచి రూ.350 ధరతో కొనుగోలు చేశా రు. పసుపును సీజన్ ప్రారంభంలో కిలో రూ.138 నుంచి రూ.140 వరకు ధరతో కొనుగోలు చేయగా ఈ వారం రూ.128 నుంచి రూ.132ధరతో సంత మార్కెట్‌లో కొనుగోలు చేశారు. ఓవరల్‌గా సీజన్ ప్రారంభంతో పోలిస్తే పిప్పళ్లకు కిలోకు రూ.50 వరకు తగ్గితే, పసుపునకు రూ.8 నుంచి 10 వరకు ధర తగ్గింది. కిలో పిప్పళ్ల నలకను రూ.65 నుంచి రూ.70 ధరతో కొనుగోలు చేశారు.


