వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 4వతేదీ బుధవారం అరకులోయ పర్యటించనున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. వై.ఎస్.జగన్ పర్యటనను విజయంతం చేయాలని ఆయన కోరారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండవ కుమారుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య వివాహానికి మాజీ సీఎం హాజరవుతున్నారని తెలిపారు.జిల్లాలోని వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు,కార్యకర్తలు,మహిళలు,పార్టీ అభిమానులు ఉదయం 9గంటలకు అరకులోయకు చేరుకుని మాజీ సీఎం జగన్‌మోహనరెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆయన తెలిపారు.


