సీలేరు: గిరిజనుల కులదేవత, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దారకొండ దారాలమ్మ అమ్మవారి జాతరను ఈ నెల 6 తేదీ నుంచి నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రతి ఏటా అమావాస్యకు 10 రోజుల ముందు జాతర నిర్వహించడం అనవాయితీ. సోమవారం భక్తుల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులు, దేవదాయశాఖ అధికారులు ఉత్సవాల తేదీలను ఖరారు చేశారు. 6వ తేదీ ఉదయం 9.39 గంటలకు ఉత్సవ రాట వేయనన్నారు. అదే రోజు ఉదయం 11.06 గంటలకు గరగలు తీస్తారు. 15వ తేదీన కలశస్థాపన, 16వతేదీన అమ్మ వారి చిన్నజాగరణ, 17న పెద్దజాగరణ, 18న అమ్మవారి పెద్ద పండగ నిర్వహించాలని నిర్ణయించారు. పండగ అనంతరం అదే రోజు అమ్మవారి ఆలయ తలుపులు మూసివేసి మరుసటి రోజు గురువారం ఉదయం 7.24 నిమిషాలకు తిరిగి తెరిచి,యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తారు.జాతరను భారీ ఎత్తున నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సోమవారం జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను అధికారులు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేపట్టారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిత్యం భోజన సదుపాయం కల్పించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.
18న ప్రధాన పండగ


