కొనుగోలు నిలిపివేయడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు నిలిపివేయడం అన్యాయం

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

జీసీసీ సంస్థ సీజన్‌ చివరి వరకు మార్కెట్‌లో పోటీలో ఉంటే గిరిజన రైతుల కాఫీ పంటకు అధిక ధరలు లభిస్తాయి. అర్ధంతరంగా కొనుగోలును నిలిపివేయడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారు.తక్కువ ధరతో దళారులకు విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. రైతుల వద్ద కాఫీ గింజల నిల్వలు పేరుకుపోయాయి.

–పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమ సంఘం నేత, పాడేరు

కాఫీ రైతులను ఆదుకోవాలి

జీసీసీ వెంటనే కాఫీ గింజల కొనుగోలు ప్రారంభించాలి. సంతల్లో వ్యాపారులు తక్కువ ధరతో కాఫీ గింజలను కొనుగోలు చేస్తున్నారు.వ్యాపారులంతా సిండికేట్‌గా మారారు.మరో వైపు తూకంలోను తేడాలు ఉండడంతో మోసపోతున్నాం.ప్రభుత్వం కాఫీ రైతులను ఆదుకోవాలి.

–కె.బాలన్న, కాఫీ రైతు, మెరకచింత, పెదబయలు మండలం

తాత్కాలికంగా నిలిపివేత

సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాఫీ గింజల కొనుగోలును తాత్కాలికంగా నిలిపివేశాం. బెంగళూరు మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గినప్పటికీ జీసీసీ గిట్టుబాటు ధరలతోనే ఇంతవరకు కొనుగోలు చేసింది.జీసీసీ యాజమాన్యం తగిన ఆదేశాలిస్తే మళ్లీ కాఫీ గింజలను కొంటాం.

–మురళీకృష్ణ, జీసీసీ ఇన్‌చార్జి డీఎం, పాడేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement