పాడేరు: వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదని, ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది సకాలంలో మెరుగైన చికిత్స అందించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. స్థానిక జిల్లా ఆస్పత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. ఆస్పత్రి తనిఖీ కోసం ఎమ్మెల్యే వచ్చిన తన వెంట వార్డుల్లోకి ప్రొటోకాల్ ప్రకారం వైద్యులు రాకపోవడంపై మండిపడ్డారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో చర్చించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 15రోజుల్లో సమావేశం నిర్వహించాలని ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావుకు సూచించారు. ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ నాయకులు సిర్మా పండన్న, ఎం.కూర్మరాజు తదితరులున్నారు.
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు


