మహాలక్ష్మికి విశేష పూజలు
శ్రీలక్ష్మీ హవనంలో పాల్గొన్న భక్తులు
పెందుర్తి: స్థానిక వేంకటాద్రిపై జరుగుతున్న ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మీ అమ్మవారికి ఆదివారం విశేష పూజలు జరిపారు. పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. శ్రీలక్ష్మీ హవవాన్ని నిర్వహించి పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీసూక్త పారాయణం విశేషంగా పఠించారు. పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. ప్రధానార్చకుడు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.


