వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 7:41 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి

ఇద్దరికి గాయాలు

కొయ్యూరు: జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌: యువకుడి దుర్మరణం

వలసంపేటకు చెందిన చదల సతీష్‌ (25) గాదేగుమ్మి నుంచి రామరాజుపాలెం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రయాణంలో బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఘాట్‌ రోడ్డులో కారు–బైక్‌ ఢీ:

వీఆర్వోకు గాయాలు

చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు రవికిరణ్‌ గాయపడ్డారు. ఆదివారం విధుల్లో భాగంగా కుమారుడితో కలిసి రాజేంద్రపాలెం వెళ్లిన సత్యనారాయణ, తిరిగి వస్తుండగా ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఒక కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరికీ కాళ్లు, చేతులు, తల భాగాల్లో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి 1
1/2

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి 2
2/2

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement