టెన్త్‌ విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 7:41 AM

టెన్త్‌ విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌

టెన్త్‌ విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌

టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్న గిరిజన

సంఘ మండల కార్యదర్శి చిరంజీవి

చింతపల్లి: భారత విద్యార్థి సమాఖ్యఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర, బాలికల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మోడల్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి వంతల పూరిస్థాన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పరీక్షకు చింతపల్లి మండలం నుంచి 169 మంది, గూడెం కొత్తవీధి మండలం నుంచి 155 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక గిరిజన సంఘం మండల కార్యదర్శి ఈ పరీక్షా ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచి అత్యున్నత మార్కులు సాధించిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరుసగా రూ. 5వేలు, రూ. 3వేలు, రూ. 2 వేలు నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రామకృష్ణ, పూర్ణ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement