ఘనంగా అంతరిక్ష అవగాహన వారోత్సవాలు
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది
పాడేరు రూరల్: పాడేరు మండలం లోచలిపుట్టు, శ్రీకృష్ణపురం పాఠశాలల్లో అంతరిక్ష అవగాహన వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ, ఆశాజ్యోతి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. సుమారు 600 మంది విద్యార్థులకు సంస్థ ప్రతినిధులు, స్థానిక ఉపాధ్యాయులు సైన్స్ అంశాలతో పాటు క్రమశిక్షణ, ప్రవర్తనపై అవగాహన కల్పించారు. సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు సీహెచ్. జగదీష్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి టెలిస్కోప్ వినియోగం, దాని పనితీరుపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు.విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకున్నప్పుడే ప్రయోగాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుందని, చదువుతో పాటు ఇతర అంశాలపై అవగాహన ఉంటేనే లక్ష్యాలను సాధించగలరని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి శాసీ్త్రయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ఇలాంటి అవగాహన తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి కె.జె. రామా రావు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యా య సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


