రికార్డుల్లేని వాహనాలు స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సరైన పత్రాలు లేని వాహనాలు నడిపినా లేదా దాచి ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని సీలేరు ఎస్‌ఐ యాసీన్ హెచ్చరించారు. ఆదివారం గ్రామాల్లోని పలు వీధుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, రికార్డులు లేని ఏడు బైకులను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు దాటే ప్రతి వాహనదారుడు తమ వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. సరైన పత్రాలు లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో వాహన దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైకులకు సంబంధించిన అసలు పత్రాలను చూపిస్తే, తిరిగి వాహనాలను అప్పగిస్తామని ఎస్‌ఐ వెల్లడించారు.


