ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలి

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 7:41 AM

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలి

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలి

నర్సీపట్నం: ఆర్టీసీలో రిటైర్‌ అవుతున్న ఉద్యోగులకు గ్రాట్యూటీ, లీవుల డబ్బులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్‌ చేశారు. నర్సీపట్నం డిపోలో పని చేస్తూ రిటైర్‌ అయిన ఈయూ సీనియర్‌ నాయకుడు జోనల్‌ జాయింట్‌ సెక్రటరీ వై.రాము పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. రాము దంపతులను యూనియన్‌ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు రిటైర్‌ అయిన రోజే గ్రాట్యూటీ, లీవుల డబ్బులతో పాటు అన్ని సెటిల్‌మెంట్లు చేసేవారన్నారు. 2024 డిసెంబర్‌ వరకు రిటైరైన వారిలో 2024 ఏప్రిల్‌ వరకు మాత్రమే చెల్లించారన్నారు. తరువాత చెల్లింపులు లేవన్నారు. రిటైర్‌ అవుతున్న ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ధీరజ్‌. ఈయు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement