తీరంలో ఫ్లాష్‌మాబ్
ఏయూక్యాంపస్ (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు విశాఖ సాగర తీరాన సందడి చేశారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఏయూ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘స్పైక్స్–26’ సాంకేతిక మరియు మేధో ఉత్సవాల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం బీచ్‌రోడ్డులోని వైఎంసిఏ వద్ద విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ప్రముఖ సినీ గీతాలకు విద్యార్థులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా అలరించారు. ఈ ప్రదర్శన ద్వారా రాబోయే జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవంపై అవగాహన కల్పించారు.


