ఉపమాకలో ఘనంగా సదస్యం | - | Sakshi
Sakshi News home page

ఉపమాకలో ఘనంగా సదస్యం

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 7:41 AM

ఉపమాకలో ఘనంగా సదస్యం

ఉపమాకలో ఘనంగా సదస్యం

స్వామివారిపై పాట ఆవిష్కరణ

నక్కపల్లి: వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో సదస్యం(పండిత సభ) ఘనంగా జరిగింది.ముందుగా స్వామివారికి నిత్యారాధనలు, బాలభోగనివేదన, రాజభోగనివేదన కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి తిరువీధి సేవలునిర్వహించారు.అనంతరం వేదపండితులను ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటివాహనంలో ఉంచి తిరువీధి సేవలు జరిపారు. ఆలయంలో డోలు ఆర్టిస్ట్‌ సింహాచలం స్వరకల్పనలో ప్రముఖ వేదపండితురాలు డాక్టర్‌ వేదాల గాయత్రీదేవి రచించిన రావోయి ఉపమాక దేవాపర అనే పాటను ఆవిష్కరించారు. ఈ పాటకు ప్రముఖ ఆర్కెస్ట్రా నిర్వాహకులు ఉప్పలపు గురుమూర్తి కుమారులు శ్రీనివాస్‌, శివ తమ వాయిద్యసహకారం అందించారు. రచయిత్రి డాక్టర్‌ గాయత్రీదేవిని పీఏసీఎస్‌ చైర్మన్‌కొప్పిశెట్టి బుజ్జి,దేవస్థానం ఇన్‌స్పెక్టర్‌ కూర్మేశ్వరరావు తదితరులు సత్కరించారు. ఈకార్యక్రమంలో తాలూకా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.వి.రామారావు, శ్రీపాద ప్రణవ్‌రామ్‌, గోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement