అక్రమణలు తొలగింపునకు ప్రత్యేక చర్యలు
పాడేరు రూరల్: పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు అక్రమణల తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పాడేరు మేజర్ పంచాయతీ ఈవో రమేష్ తెలిపారు. శనివారం పట్టణంలోని పాత బస్టాండ్, కింద బజార్, సాయిబాబా గుడి ఏరియా, సినిమా హాల్ సెంటర్ వంటి ప్రధాన కూడళ్లలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమణలను అధికారులు తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లా కేంద్రం కావడంతో రోజురోజుకూ జనసంచారం పెరుగుతోందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ అక్రమ దుకాణాలు ఉన్నా వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. వ్యాపారులు తమ సముదాయాల ముందు గుడారాలు వేయకుండా జాగ్రత్త వహించాలని, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పాడేరు పంచాయతీ ఈవో రమేష్


