ఏపీఆర్‌ సెట్‌లోజి.మాడుగుల ప్రిన్సిపాల్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఏపీఆర్‌ సెట్‌లోజి.మాడుగుల ప్రిన్సిపాల్‌ ప్రతిభ

Feb 28 2026 7:23 AM | Updated on Feb 28 2026 7:23 AM

ఏపీఆర్‌ సెట్‌లోజి.మాడుగుల ప్రిన్సిపాల్‌ ప్రతిభ

ఏపీఆర్‌ సెట్‌లోజి.మాడుగుల ప్రిన్సిపాల్‌ ప్రతిభ

పారయ్యకు రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంక్‌

జి.మాడుగుల: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీ గా ఉన్న పీహెచ్‌డీ సీట్ల భర్తీకి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఆర్‌ సెట్‌ ఫలితాల్లో స్థానిక ఏపీఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ యండమూరి పారయ్య ప్రతిభ చాటారు. ఆయన రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 2025 నవంబర్‌లో రాత పరీక్ష, 2026 ఫిబ్రవరిలో మౌఖిక పరీక్ష నిర్వహించగా తుది ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ పారయ్య మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో శాసీ్త్రయ విజ్ఞానం అనే అంశంపై పరిశోధన చేయాలనే ఆసక్తితో తాను ఈ పరీక్ష రాసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించి కళాశాలకు పేరు తెచ్చిన ప్రిన్సిపాల్‌ పారయ్యను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement