రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా క్రీడాకారులప్రతిభ
కశింకోట : రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు వేర్వేరు విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని కన్నూరుపాలేనికి చెందిన ప్రగతి చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు డి.ఎస్ గాయత్రిదేవి, చెస్ సీనియర్ నేషనల్ ఆర్బిటర్ డి.వి.సుధీర్‌కుమార్ అన్నారు. ఇటీవల తిరుపతిలో స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( ఎస్‌ఎఎపి) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు జరగ్గా తమ అసోిసియేషన్ ప్రోత్సాహంతో వెళ్లిన జిల్లాలోని ఎస్.రాయవరానికి చెందిన శ్రావ్యశ్రీ (15 ఏళ్లలోపు విభాగం)లో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇదే గ్రామానికి చెందిన భీమరశెట్టి సహస్ర (13 ఏళ్ల లోపు విభాగం), అనకాపల్లికి చెందిన వెంకటేశ్వరరావు (17 ఏళ్ల లోపు విభాగం) తృతీయ స్థానం సాధించారన్నారు. వీరిలో ఫిడే రేటింగ్ సాధించిన శ్రావ్యశ్రీ త్వరలో నాగాలాండ్‌లో జరగనున్న జాతీయ టీం ఛాంపియన్‌షిప్‌లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా క్రీడాకారులప్రతిభ
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా క్రీడాకారులప్రతిభ


