పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు
అనకాపల్లి టౌన్/రావికమతం : విజయనగరంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 7వ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో అనకాపల్లి జిల్లా రావికమతం మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు సింగిల్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ వీల్ చైర్, డ్వార్ఫిజం పారా బ్యాడ్మింటన్ కేటగిరిలలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. రావికమతం మండలం, తోటకూరపాలెం గ్రామానికి చెందిన గూనురు ఆదిలక్ష్మి (వీల్ చైర్ కేటగిరిలో) 2 గోల్డ్ మెడల్స్, మరుపాక గ్రామం రౌతు తనుష్ ఒక గోల్డ్ మెడల్, టి. అర్జాపురం గ్రామానికి చెందిన రాజాన మానస (షార్ట్ స్టేచర్ కేటగిరిలో) ఒక గోల్డ్ మెడల్, ఒక రజత పతకం, ఎల్.ఎన్.పురం గ్రామానికి చెందిన నిమ్మి హేమ దుర్గ (షార్ట్ స్టేచర్ కేటగిరిలో) గోల్డ్ మెడల్, కొత్తకోట గ్రామానికి చెందిన వెల్లంకి (లోకేష్ షార్ట్ స్టేచర్ కేటగిరిలో) 2 కాంస్య పతకాలు సాధించారు. ఈ విద్యార్థులను సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణ నాయుడు అభినందించారు.
పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు


