వృత్తి విద్యా కోర్సులతోనే ఉజ్వల భవిష్యత్తు
● ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి
డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రిిన్సిపాల్ విజయభారతి
చింతపల్లి: విద్యార్థులు చదువుకునే కాలంలోనే వృత్తి విద్యా కోర్సుల పట్ల ఆసక్తి చూపితే భవిష్యత్తులో మంచి ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి అన్నారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థినులకు బ్యూటీషియన్ కోర్సులో 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నూతన ఉత్సాహంతో ఇలాంటి నైపుణ్య కోర్సులను నేర్చుకోవాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమం పాడేరు డిగ్రీ కళాశాల, పీఎం ఉషా పథకం ఆధ్వర్యంలో జరుగుతోందని తెలిపారు. ఈ శిక్షణకు వనిత శిక్షకురాలిగా వ్యవహరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఎం ఉషా కో–ఆర్డినేటర్ వి. రమణ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసపాత్రుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


