ప్రజల వద్దకు పోలీస్
● సమస్యలు తెలుసుకున్న
మంప ఎస్‌ఐ శ్రీనివాసరావు
కొయ్యూరు: మండలంలోని మంప ఎస్‌ఐ సీదరి శ్రీనివాసరావు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఆయన మంప పంచాయతీ కించవానిపాలెం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ నేలపై కూర్చుని వృద్ధులతో మాట్లాడారు.వారి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాకాలంలో జలాశయం మూలంగా ఇబ్బందులు వస్తున్నాయని వారు తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం ఇదే పంచాయతీ గంగవరం గ్రామాన్ని సందర్శించారు. యువత సైబర్ నేరగాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటిపై అవగాహన కల్పించారు. కోడి పందాలు, పేకాటకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి మూలంగా ఎదురయ్యే అనర్థాలపై అవగాహన కల్పించారు.


