కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణకు కృషి
పాడేరు రూరల్: ఎర్ర జెండాల అండతోనే అన్ని వర్గాల కార్మిక, ఉద్యోగుల హక్కులు చట్టాల పరిరక్షణ సాధ్యమని సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి లింగేరి సుందరరావు తెలిపారు. మండలంలో మినుములూరు కాఫీ కాలనీలో ప్రధాన రహదారి కూడలిలో వివిధ రంగాల కార్మిక సంఘాల నాయకులతో కలిసి సీఐటీయూ జెండాను అవిష్కరించారు, అనంతరం ఆయన మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు అద్ధం పటే విధంగా కార్మిక హక్కులు, చట్టాలను నిర్వీర్యానికి కుట్ర పనుతున్నారన్నారు. కార్మిక చట్టాల అమలులో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండ స్కీం వర్క్‌ర్లు, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, కార్మికులను నిలుపుదోపిడీ చేస్తుందన్నారు. అనంతరం విశాఖలో జరిగే సీఐటీయూ అఖీల భారత మహసభకు కార్మిక సంఘాల నాయకులు, తరలి వెళ్లారు, కార్మిక సంఘాల నాయకులు ప్రసాద్, రత్నాలమ్మ, సుజాత, కాంతమ్మ, కాసులమ్మ, రాజేశ్వరి, మణి, సూరిబాబు, సింహచలం తదితరులు పాల్గొన్నారు.


