సారా బట్టీలపై పోలీసుల విస్తృత దాడులు
స్వాధీనం చేసుకున్న బెల్లం ఊట, వంట పాత్రలతో ఎస్‌ఐ రాజారావు, సిబ్బంది
నర్సీపట్నం: అక్రమ మద్యం, నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా సీఐ ఎల్.రేవతమ్మ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజారావు, సిబ్బంది మండలంలో సారా బట్టీలపై ఆదివారం విసృ్‌ృతతంగా దాడులు నిర్వహించారు. పాత లక్ష్మీపురం, గదబపాలెం గ్రామ శివార్లలో ఆకస్మిక సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. గ్రామ శివార్లోని జీడి తోటల్లో రహస్యంగా నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 3,200 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. సారా కాచడానికి ఉపయోగిస్తున్న డ్రమ్ములు, పాత్రలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాజారావు హెచ్చరించారు.


