మార్చి 29న ప్రో బాక్సింగ్ పోటీలు
కంచరపాలెం: ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 29న అంతర్జాతీయ ప్రో బాక్సింగ్ ఈవెంట్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు విశాఖ ప్రో బాక్సింగ్ ప్రమోటర్ యల్లపు రఘురామ్ తెలిపారు. కై లాసపురం బాక్సింగ్ క్లబ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర కౌన్సిల్ జనరల్ సెక్రటరీ వి.అమ్మోరు, సలహాదారులు, నేషనల్ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గొర్లె చందు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.ప్రభాకర్, ఎం.సుగుణకుమార్, సతీష్, కోచ్‌లు బి.శ్రీను, వి.రూబెన్ తదితరులు పాల్గొన్నారు.


