కిక్కిరిసిన చెరువులవెనం
చింతపల్లి: ఆంధ్రా–కశ్మీర్ లంబసింగి శనివారం రాత్రి నుంచి పర్యాటకులతో కిటకిటలాడింది. ఇక్కడికి సమీపంలోని చెరువులవెనం వ్యూపాయింట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారీగా తరలివచ్చిన సందర్శకులు ప్రకృతి అందాలను తిలకించారు. గిరిజనులతో కలిసి థింసా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన చాపరాయి, అరకు పైనరీకి ఆదివారం పర్యాటకులు తాకిడి కాస్త తగ్గింది. జాతీయ రహదారిని అనుకుని ఉన్న చాపరాయిలో ట్రాఫిక్ లేకపోవడంతో అరకు– పాడేరు ప్రయాణం సాఫీగా సాగిపోయింది. కురిడి సమీపంలోని నారింజవలస వద్ద పొద్దుతిరుగుడు తోటలో పర్యాటకులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఒక్క ఫొటో తీసుకునేందుకు తోట యజమానికి రూ.20 నుంచి రూ.30 చెల్లించారు. అరకు పైనరీలో సందడి నెలకొంది.
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయకు పర్యాటకుల తాకిడి నెలకొంది. క్రిస్మస్‌నుంచి రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం భారీగా తరలిరావడంతో గిరిజన మ్యూజియం, మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలు కళకళలాడాయి. గిరిజన మ్యూజియంలో జిప్‌లైన్,, స్కై సైక్లింగ్, బోటు షికారు చేస్తూ సందడి చేశారు.
కిక్కిరిసిన చెరువులవెనం
కిక్కిరిసిన చెరువులవెనం


