హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి
కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు: బొత్స సత్యనారాయణ
బీచ్‌రోడ్డు: వైఎస్సార్‌సీపీ పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అరకు నియోజకవర్గ నాయకులు బొత్సను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బొత్స వారికి సూచించారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, పార్టీ కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. బొత్సను కలిసిన వారిలో జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జిన్ని నరసింహమూర్తి, అరకు వ్యాలీ ఎంపీటీసీ దురియ ఆనంద్ కుమారి, సీనియర్ నాయకులు భూర్జ హస్తిన కుమార్, గొల్లోరి గోపాల్ రావు, మజ్జి గురు, బోయి మోహన్ రావు, శెట్టి సోమేష్, కొర్రా బాబురావు, కొర్రా సాలమన్, భీమన్న, రామారావు తదితరులు ఉన్నారు.


