పలు రైళ్ల దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: సికింద్రాబాద్ డివిజన్ పరిధి కాజీపేట–బల్హార్షా సెక్షన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు విజయవాడ–బల్హార్షా మీదుగా కాకుండా.. విజయనగరం, రాయగడ, టిట్లాఘడ్, రాయ్‌పూర్ మీదుగా నడుస్తాయి. 2026 జనవరి 29, ఫిబ్రవరి 5, 12వ తేదీల్లో విశాఖ–గాంధీదాం(20803)సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో విశాఖ– న్యూఢిల్లీ(20805)ఏపీ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ–విశాఖ(20805) ఏపీ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 1, 8వ తేదీల్లో గాంధీదాం–విశాఖ (20804) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, పూరీ–ఓఖా(20819) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 4, 11న ఓఖా–పూరీ(20820) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 6, 9, 13వ తేదీల్లో విశాఖపట్నం– హజరత్ నిజాముద్దీన్(12803) స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 8, 11వ తేదీల్లో హజరత్ నిజాముద్దీన్–విశాఖ(12804) స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లు రెగ్యులర్ మార్గంలో కాకుండా.. వయా విజయనగరం–రాయగడ–టిట్లాఘడ్–రాయ్‌పూర్ మీదుగా నడుస్తాయి.


