వచ్చే నెల 3 నుంచి శ్రీ నృసింహ దీక్షలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నృసింహ దీక్షలు డిసెంబరు 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. దేవస్థానం వైదికులు నిర్ణయించిన ప్రకారం డిసెంబరు 3వ తేదీ నుంచి మండల దీక్ష, డిసెంబరు 11వ తేదీ నుంచి 32 రోజుల దీక్ష ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మాలధారణ చేసే భక్తులకు దేవస్థానం తరపున తులసి మాల, స్వామి ప్రతిమ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12న రెండు దీక్షలు విరమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


