
ఎరువుల దుకాణాలు తనిఖీ
రాజవొమ్మంగి: మండలంలోని ఎరువుల దుకాణాలను రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మంగళవారం తనిఖీ చేశారు. గొడౌన్లు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రిజిస్టర్లు, ధరలను ఆయన పరిశీలించారు. రైతులకు అవసరమైన అన్ని ఎరువులు అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా ముందుగా ఇండెంట్ పెట్టుకొని నిల్వలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ధరలు కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ తనిఖీల్లో తహసీల్దార్ సత్యనారాయణ, ఏవో చక్రధర్, సీఐ గౌరీ శంకర్, ఎస్‌ఐ నర్సింహమూర్తి పాల్గొన్నారు. నరశింహామూర్తి సిబ్బంది పాల్గొన్నారు.